అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- August 15, 2026
అబుదాబి: ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ‘ది లస్సీ షాప్’కు చెందిన ఓ శాఖను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆగస్టు 14న ఈ మేరకు పరిపాలనా మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా తనిఖీల్లో సదరు దుకాణంలో పదేపదే నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు దుకాణం సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడంతో వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అబుదాబి ఎమిరేట్‌లో ఆహార భద్రతకు సంబంధించిన 2008 నాటి చట్టం నంబర్ 2తో పాటు దాని కింద జారీ చేసిన నిబంధనలను దుకాణం ఉల్లంఘించినట్లు ADAFSA వెల్లడించింది. ఆహార సంస్థల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఆహార పదార్థాలపై అనుమానాలు లేదా ఇతర సమస్యలు కనిపిస్తే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇందుకోసం అబుదాబి ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 800555కు సమాచారం అందించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







