యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!

- August 17, 2026 , by Maagulf
యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!

మనామా: బహ్రెయిన్‌లో జాతీయ గుర్తింపు, పౌర బాధ్యత, సామాజిక విలువలను యువతలో పెంపొందించే లక్ష్యంతో ‘బహ్రైనన్నా’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూత్ సిటీ 2030లో ఏర్పాటు చేసిన బహ్రైనన్నా పెవిలియన్‌లో ఆగస్టు  20 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జాతీయ అనుబంధాన్ని పెంపొందించడం, పౌరసత్వ భావనను బలోపేతం చేయడం కోసం బహ్రైనన్నా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్.. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దేశంలోని వివిధ యువజన కేంద్రాల సహకారంతో ఈ విద్యా క్షేత్ర పర్యటనలను నిర్వహిస్తోంది. ప్రతి పర్యటనలో వివిధ యువజన కేంద్రాలకు చెందిన సుమారు 50 మంది పాల్గొంటున్నారు.

యూత్ సిటీ 2030లోని బహ్రైనన్నా పెవిలియన్‌ను సందర్శిస్తున్న యువతకు పలు ఇంటరాక్టివ్ కార్యక్రమాలను పరిచయం చేస్తున్నారు. మొదటి రోజే వాటని మ్యాగజైన్ కార్నర్, బహ్రైనన్నా పెవిలియన్‌లో నిర్వహించిన జాతీయ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే లాయల్టీ ట్రీ, టెక్నాలజీ అండ్ స్పేస్ సెంటర్, లిటిల్ ఎంటర్‌ప్రెన్యూర్, బహ్రైనన్నా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక సాంకేతికత, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లను ఉపయోగించి జాతీయ సంస్కృతి, సామాజిక అవగాహనను పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించారు.

యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు జాతీయ అనుబంధం, సామాజిక భాగస్వామ్యం వంటి విలువలను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని బహ్రైనన్నా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తెలిపింది. బహ్రెయిన్ జాతీయ గుర్తింపుపై గర్వించే, దేశ సమగ్ర అభివృద్ధిలో చురుకుగా భాగస్వాములయ్యే భావి తరాన్ని తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. వివిధ గవర్నరేట్లకు చెందిన మరిన్ని యువజన కేంద్రాలతో ఈ సందర్శనలను వారం పొడవునా కొనసాగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com