ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రతి 15 నిమిషాలకు ఉచిత షటిల్ సర్వీస్..!!
- August 18, 2026
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు ఉచిత షటిల్ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ సర్వీస్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అందుబాటులో ఉంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. షటిల్ సేవలను వినియోగించుకునేందుకు ముందస్తు బుకింగ్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో విమానాలు మారాల్సిన ప్రయాణికులు, ఎక్కువ లగేజీతో ఇబ్బంది పడేవారు, విమానాశ్రయంలోని వివిధ కాన్కోర్స్ల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలిపింది.
నిర్దేశించిన ప్రదేశాల్లో షటిల్ బగ్గీలను ఎక్కవచ్చని.. సీట్లు అందుబాటులో ఉంటే మార్గమధ్యంలో కూడా ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.ప్రత్యేక సహాయం అవసరమైన ప్రయాణికుల కోసం ప్రత్యేక అసిస్టెన్స్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. అవసరమైన వారు విమానాశ్రయ సిబ్బందిని సంప్రదిస్తే తగిన సహాయం ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. షటిల్ సర్వీస్ ద్వారా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ ఎస్కలేటర్ల సమీపంలో దింపుతామని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ బంపర్ ఆఫర్
- కార్మిక రెసిడెన్సీల రద్దు, ఇరాన్‌కు ఆర్థిక సౌకర్యాలపై UAE స్పష్టత
- ఘోర అగ్నిప్రమాదం: హోటల్లో మంటలు చిక్కుకుని 9 మంది మృతి!
- బంగారు గని కూలి 30 మంది దుర్మరణం!
- భోగాపురం ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఛార్జీల షాక్
- రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ: ముగ్గురు విద్యార్థుల హస్తం?
- కువైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!
- దుబాయ్‌లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!
- బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!







