దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం GDRFA ప్రత్యేక ఏర్పాట్లు
- August 18, 2026
దుబాయ్: సెలవులు ముగించుకుని యూఏఈకి తిరిగి వస్తున్న పౌరులు, నివాసితులు, సందర్శకులకు సులభమైన, వేగవంతమైన ప్రయాణ సేవలు అందించేందుకు దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తన సన్నద్ధతను మరింత పెంచింది.
దుబాయ్ విమానాశ్రయాల్లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, ప్రయాణికుల సేవా కేంద్రాల్లో సిబ్బంది మరియు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు GDRFA తెలిపింది.
సెలవుల అనంతరం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు దుబాయ్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో.. విమానాశ్రయాల్లో రద్దీని సమర్థంగా నిర్వహించడం, ప్రయాణికులకు అవసరమైన సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా అందించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
పౌరులు, యూఏఈ నివాసితులు, విదేశీ సందర్శకులకు సాఫీగా ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ట్రావెల్ అవుట్‌లెట్లలో కార్యాచరణ సన్నద్ధతను బలోపేతం చేసినట్లు GDRFA పేర్కొంది.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అధికారులు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపింది.
సెలవుల నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో అధికారుల సూచనలను పాటిస్తూ తమ ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, తద్వారా ప్రవేశ ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్‌కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







