లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. సౌదీలో కొత్త నిబంధనలు..!!
- August 18, 2026
రియాద్: అధిక ప్రమాదం లేదా అధిక జనసాంద్రత ఉన్న కార్యకలాపాలకు లైసెన్స్ జారీ, రెన్యువల్ చేయాలంటే థర్డ్ పార్టీ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా పొందాలని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ చర్యలను బలోపేతం చేయడంతో పాటు సంస్థలు నిబంధనలను పాటించేలా చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తొలి దశలో రసాయనాల గోదాములు, వాడిన నూనెల నిల్వ కేంద్రాలు, ప్రమాదకర వైద్య వ్యర్థాల నిల్వ కార్యకలాపాలు, అన్ని రకాల కలప హోల్‌సేల్ వ్యాపారాలు, వివిధ రకాల వస్తువులు నిల్వ చేసే సాధారణ గోదాములు, కారు టైర్ల గోదాములు, పెయింట్ల తయారీ, పారిశ్రామిక డిటర్జెంట్ల తయారీ వంటి కార్యకలాపాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
లైసెన్స్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇన్సూరెన్స్‌ను కీలకమైన అర్హతగా పరిగణిస్తున్నట్లు సివిల్ డిఫెన్స్ పేర్కొంది. ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తులు, సంస్థలు, సంబంధిత భాగస్వాముల హక్కులను కాపాడటంతో పాటు సంభవించే ఆర్థిక నష్టాలను తగ్గించడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
తొలి దశలో పరిధిలోకి వచ్చే సంస్థలు లైసెన్స్ జారీ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు థర్డ్ పార్టీ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాలని సివిల్ డిఫెన్స్ సూచించింది. ప్రమాద నివారణ, నియంత్రణ చర్యలు, ఇన్సూరెన్స్ వ్యవస్థలను సమన్వయం చేయడం ద్వారా సంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే ఈ చర్య లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్‌కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







