ఖతార్‌లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- August 18, 2026
దోహా: ఖతార్‌లో కస్టమ్స్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో (CGB) సమన్వయంతో ‘షారెక్’ డిజిటల్ వేదికపై ఈ సర్వేను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా కస్టమ్స్ సేవలపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, అవగాహనను తెలుసుకోవడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పౌరులు, ప్రవాసులు, వ్యాపార వర్గాల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించి సేవల్లో అవసరమైన మార్పులను గుర్తించనున్నారు.
కమ్యూనిటీ భద్రతను కాపాడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగేందుకు కస్టమ్స్ అధికారులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమాన, సముద్ర, భూ సరిహద్దుల్లో నియంత్రణతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలోనూ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రజల నుంచి వచ్చే సూచనలు కస్టమ్స్ ప్రక్రియలను మరింత సులభతరం చేయడానికి, క్లియరెన్స్ విధానాలను మెరుగుపరచడానికి, కస్టమర్ సేవల ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలు, ప్రజల మధ్య డిజిటల్ వారధిగా ‘షారెక్’ వేదిక పనిచేస్తోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ సేవల అనుభవాలను పంచుకోవడంతో పాటు సూచనలు, అభిప్రాయాలను సులభంగా తెలియజేయవచ్చు. పౌరులు, ప్రవాసులు, వ్యాపార రంగ ప్రతినిధులు ‘షారెక్’ వేదికను సందర్శించి ప్రశ్నావళిని పూర్తి చేయాలని CGB కోరింది.
కాగా, సర్వే ద్వారా వచ్చిన అభిప్రాయాలను GAC, CGBకు చెందిన సంయుక్త బృందాలు విశ్లేషించనున్నాయి. వాటి ఆధారంగా భవిష్యత్‌లో కస్టమ్స్ సేవల మెరుగుదల, డిజిటల్ మార్పులు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా కస్టమ్స్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఈ సర్వే కీలక ముందడుగుగా నిలవనుంది.
తాజా వార్తలు
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్‌కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్‌కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్‌లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు







