బహ్రెయిన్ జలాల్లో అక్రమ చేపల వేట.. ముగ్గురి అరెస్ట్..!!
- August 19, 2026
మనామా: బహ్రెయిన్ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న ముగ్గురిని కోస్ట్‌గార్డ్ అధికారులు అరెస్ట్ చేశారు. సముద్ర నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నిషేధిత బాటమ్ ట్రాల్ వలలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన పడవ దేశ సముద్ర సరిహద్దులను దాటి వెళ్లింది.
కోస్ట్‌గార్డ్ సిబ్బంది పలుమార్లు హెచ్చరించి పడవను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, వారు తిరిగి సముద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పడవలో ఉన్నవారు అడ్డంకులు సృష్టించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పడవలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను కూడా ఆపివేసినట్లు తెలిపింది.
అరెస్టైన ముగ్గురిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తదుపరి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మత్స్యకారులు, సముద్ర వినియోగదారులు చేపల వేట మరియు సముద్ర నావిగేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోస్ట్‌గార్డ్ సూచించింది. సముద్ర గస్తీ సిబ్బంది తనిఖీల సమయంలో ఇచ్చే ఆదేశాలను వెంటనే పాటించాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!
- దుబాయ్‌లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!
- బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!
- యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పనితీరుపై వీడియో విడుదల..!!
- ఒమన్‌లో వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్.. ఖౌలా ఆసుపత్రికి తరలింపు..!!
- బహ్రెయిన్ జలాల్లో అక్రమ చేపల వేట.. ముగ్గురి అరెస్ట్..!!
- సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు: యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు నిలిపివేసిన యూఏఈ
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!







