ఒమన్‌లో వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్.. ఖౌలా ఆసుపత్రికి తరలింపు..!!

- August 19, 2026 , by Maagulf
ఒమన్‌లో వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్.. ఖౌలా ఆసుపత్రికి తరలింపు..!!

మస్కట్: ఒమన్‌లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన ఓ పౌరుడిని రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా తరలించారు. అల్ షర్‌ఖియాహ్ గవర్నరేట్‌లోని ఓ పర్వత ప్రాంతంలో పర్వతారోహణ చేస్తుండగా సదరు వ్యక్తికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెంటనే రంగంలోకి దిగి ఎయిర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స కోసం మస్కట్‌లోని ఖౌలా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com