ఖతార్‌లో కొత్త డ్రోన్ చట్టంపై అవగాహన కార్యక్రమం..!!
- August 20, 2026
దోహా: డ్రోన్ల వినియోగాన్ని నియంత్రించే కొత్త చట్టంపై ఖతార్ పౌర విమానయాన సంస్థ (QCAA) ప్రజలకు అవగాహన కల్పించింది. 2026 నంబర్ 10 చట్టం కింద డ్రోన్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, అవసరాలపై ఆగస్టు 19న ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించిన చట్టంలోని ప్రధాన నిబంధనలను అధికారులు వివరించారు. డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. వాణిజ్య, పరిశోధన, వినోద రంగాల్లో వీటి వినియోగం పెరుగుతున్నందున వాటి కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. డ్రోన్లను సురక్షితంగా, నిబంధనలకు అనుగుణంగా వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని QCAA పేర్కొంది.
డ్రోన్ టెక్నాలజీ అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు.. విమాన రాకపోకల భద్రత, ఖతార్ గగనతల రక్షణకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
కొత్త చట్టంలోని నిబంధనలు, అనుమతులు, అవసరమైన భద్రతా ప్రమాణాలపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా ఖతార్‌లో డ్రోన్ కార్యకలాపాలను మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు QCAA వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!
- స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో కొత్త డ్రోన్ చట్టంపై అవగాహన కార్యక్రమం..!!
- కువైట్‌లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!
- ఒమన్‌లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!
- సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా







