రాఖీ పౌర్ణమి సందడి తెలుగు రాష్ట్రాల్లో..
- August 17, 2016
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి మొదలయ్యింది. సోదరులకు రాఖీలు కట్టి ప్రేమాభిమానాల్ని చాటుకునేందుకు సోదరీమణులు సిద్ధమవుతున్నారు. అటు మార్కెట్‌లో 10 రూపాయల నుంచి మొదలు కొని ఐదొందల వరకు వివిధ రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. మొత్తానికి అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఈ బంధం మరింత బలోపేతమయ్యేందుకు ఈ శుభ దినం దోహదం చేస్తుంది.
అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఒకరికి ఒకరు ఉన్నాం అనే ధీమానిచ్చే బంధాలివి. జీవితాంతం భరోసానిచ్చే అనుబంధాలివి. అడుగడుగునా సంరక్షణనిచ్చే నమ్మకాలివి. అందుకే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ పౌర్ణమి.
కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే ఉత్సవమే రాఖీ పౌర్ణమి.ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టేందుకు సోదరుల ఇంటికి పయనమవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాఖీ సందడి అంతా ఇంతా కాదు. అందమైన రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు, బాలికలు బుధవారం బిజిబిజీగా గడిపారు. దీంతో రాఖీ దుకాణాలు, స్టాళ్లు జనాలతో కిటకిటలాడాయి. అటు..10 నుంచి మొదలుకొని 500 రూపాయల వరకు ధరల్లో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తికి తగ్గట్లుగానే తయారీదారులు వెరైటీ రాఖీలను తయారు చేసారు. ఈసారి మోదీ రాఖీలు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా చిన్నారులను ఛోటా భీం రాఖీలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోదరులకు రాఖీలు కట్టాక నోరు తీపి చేయడం ఆనవాయితీ.. దీంతో స్వీట్ షాపులూ కిటకిటలాడుతున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







