చైనా హ్యాండ్ సెట్ల తయారీ ప్లాంట్ భారత్ లో...
- August 17, 2016
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయదారి అయిన హువావే కూడా భారత్ లో హ్యాండ్ సెట్ల తయారీకి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కార్యకలాపాలను ప్రారంభించబోతుందట. ఇంకో నెలలో ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలను హువావే వెల్లడించనుంది. ప్రస్తుతం భారత్ లో హ్యాండ్ సెట్ల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి లైసెన్సు పొందామని, త్వరలోనే తయారీ ప్రణాళిక వివరాలను వెల్లడిస్తామని హువావే ఇండియా కన్సూమర్ బిజినెస్ గ్రూపు అధినేత పిటర్ జాయ్ తెలిపారు. చైనా తర్వాత తమ మొబైల్ డివైజ్ లకు భారత్ రెండో మార్కెట్ గా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్ గా, సరియైన సమయంలో భారత్ లో వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నామని వెల్లడించింది.భారత్ మార్కెట్లో తమ దూకుడును పెంచి, హువావే స్టోర్లను 50వేలకు పెంచుతామని పిటర్ వివరించారు. గత 16 ఏళ్లుగా హువావే భారత్ లో మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపడుతోంది. 1999లో బెంగళూరులో స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసింది. సొంత బ్రాండెడ్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కూడా హువావే ప్లాన్ చేస్తోంది. కానీ ఆ ప్లాన్ కు సంబంధించిన వివరాలను ఇంకా బయటికి వెల్లడించలేదు. బుధవారమే హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్ హువావే పీ9ను రూ.39,999లకు ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









