ఖతార్‌లో కొత్తగా ఆరు ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్..!!
- August 23, 2026
దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి సన్నాహాల్లో భాగంగా ఖతర్ విద్య, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోల్వా బింత్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ ఖాతేర్ ఆరు కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా అల్ సఖామాలో ఖతర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేటరీ అండ్ సెకండరీ స్కూల్(బాయ్స్, రౌదత్ అల్ హమామాలో ఖతర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండరీ స్కూల్ (గర్ల్స్), ఐన్ ఖాలెద్ సెకండరీ స్కూల్ (బాయ్స్), దోహా ప్రిపరేటరీ స్కూల్ (గర్ల్స్), అల్ థఖీరా ప్రైమరీ స్కూల్ (బాయ్స్), ముఐథర్ ప్రైమరీ స్కూల్ (బాయ్స్) స్కూళ్లను ప్రారంభించనున్నారు.
అలాగే, 17 మంది ప్రన్సిపల్స్ ను కొత్తగా నియమించడంతోపాటు మరో 17 మంది ప్రిన్సిపల్స్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వ పాఠశాలలను మరింత సన్నద్ధం చేయడం, పాఠశాలల పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఖతర్ నేషనల్ విజన్–2030లోని మానవ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యపై పెట్టుబడులు పెంచడం, మానవ వనరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ సుస్థిర అభివృద్ధికి ఈ చర్య దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..25 రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ!
- సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్‌లో బోర్డింగ్ పాస్‌పై స్టాంపింగ్ రద్దు..!!
- బహ్రెయిన్‌లో 17 వేల కుటుంబాలకు హౌసింగ్ ఫైనాన్స్ ప్రయోజనం..!!
- ఒమన్‌లో ఆస్తి సంబంధిత నేరాలే అత్యధికం..ఎన్సీఎస్ఐ నివేదిక..!!
- సౌదీలో వారం రోజుల్లో 13,724 మందిపై బహిష్కరణ వేటు..!!
- అమెరికాకు అండగా నిలిస్తే శత్రువులుగా పరిగణిస్తాం..ఇరాన్ హెచ్చరిక
- ఖతార్‌లో కొత్తగా ఆరు ప్రభుత్వ పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్..!!
- బహ్రెయిన్‌లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు







