ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- August 26, 2026
అమెరికా: అమెరికా-ఇరాన్ మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇటీవల పలువురు విదేశీ మిత్రదేశాల మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వాషింగ్టన్ ప్రస్తుత ఇరాన్ విధానాన్ని స్పష్టం చేశారు. ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతానికి ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించే ఆలోచన అమెరికాకు లేదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా ఆర్థిక ఒత్తిడిని పెంచడం, సైనిక చర్య కాకుండా ఇతర మార్గాల ద్వారా టెహ్రాన్‌ను అదుపు చేయడానికే వాషింగ్టన్ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి చేస్తాం : అమెరికా
ముఖ్యంగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇటీవల ప్రకటించిన కఠినమైన ఆంక్షల కార్యక్రమాన్ని అమలు చేయడమే ఇప్పుడు తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. అమెరికా (America) మళ్లీ పెద్ద ఎత్తున నేరుగా పోరాట చర్యల్లోకి దిగాలని భావించడం లేదని రూబియో స్పష్టం చేసినప్పటికీ.. ఒకవేళ ఇరాన్ వైపు నుండి ఏదైనా ముందస్తు దాడి జరిగితే మాత్రం ప్రతిదాడి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధికారులు తెలిపారు. రాజకీయం, వ్యూహాత్మక పరంగా చూస్తే, ప్రస్తుతానికి సైనిక ఘర్షణలకు దూరంగా ఉండటం, నౌకా దిగ్బంధనం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత తీవ్రతరం చేయడం ట్రంప్ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనితో పాటు, ప్రపంచ మార్కెట్లకు ఇంధన కొరత రాకుండా హార్ముజ్ జలసంధి ద్వారా వీలైనంత ఎక్కువ చమురును రవాణా చేయడానికి అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







