ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!

- August 30, 2026 , by Maagulf
ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!

మస్కట్: ఒమన్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడిని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఎయిర్ వింగ్ వైద్య తరలింపు ద్వారా నిజ్వా ఆస్పత్రికి తరలించింది. హైమా విలాయత్‌కు సుమారు 40 కిలోమీటర్ల దక్షిణాన ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో ఎయిర్ వింగ్ రంగంలోకి దింపినట్లు ఆర్వోపీ తెలిపింది.

హెలికాప్టర్ ద్వారా బాధితుడిని నిజ్వా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వ్యక్తి పరిస్థితిపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com