సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- August 30, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల్లో వారం రోజుల్లో 14,434 మంది అక్రమ నివాసితులు అరెస్టయ్యారు. ఆగస్టు 20 నుంచి 26 వరకు సంబంధిత ప్రభుత్వ శాఖల సహకారంతో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారిలో 6,976 మంది రెసిడెన్సీ చట్టం, 4,110 మంది సరిహద్దు భద్రతా చట్టం, 3,348 మంది కార్మిక చట్టం ఉల్లంఘించినవారుగా అధికారులు గుర్తించారు.
సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,450 మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారిలో 41 శాతం మంది యెమెన్ జాతీయులు, 58 శాతం మంది ఇథియోపియా జాతీయులు కాగా, మిగిలిన ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా సౌదీ అరేబియా నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మందిని కూడా అరెస్ట్ చేశారు.
14,905 మంది బహిష్కరణ
అక్రమ నివాసితుల్లో 14,905 మందిని దేశం నుంచి బహిష్కరించారు. మరో 18,914 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దేశాల దౌత్య కార్యాలయాలకు పంపించారు. అలాగే 2,867 మందిని ప్రయాణ రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు.
అక్రమ నివాసితులకు రవాణా, ఆశ్రయం లేదా ఉపాధి కల్పించడంలో సహకరించిన 27 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం మొత్తం 29,938 మంది విదేశీయులు చట్టపరమైన చర్యలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నారు. వీరిలో 27,957 మంది పురుషులు, 1,981 మంది మహిళలు ఉన్నారు.
సౌదీలోకి అక్రమంగా వ్యక్తులను ప్రవేశింపజేయడం, దేశంలో వారిని రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం, ఉపాధి కల్పించడం లేదా ఏ విధమైన సహాయం అందించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. నేరానికి ఉపయోగించిన వాహనాలు, ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అక్రమ నివాసితులు, సరిహద్దు ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబర్‌కు, మిగిలిన సౌదీ ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







