బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది నేడు ..

- August 19, 2016 , by Maagulf
బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది నేడు ..

ఈరోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.31,250కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్‌ తగ్గినప్పటికీ దేశీయంగా డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరుగుతూనే ఉండడంతో బంగారం ధర పెరుగుతోంది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం తగ్గి 1,345.80 అమెరికా డాలర్లకు చేరింది.డిమాండ్‌ లేమితో నేడు వెండి ధర తగ్గింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ.185 తగ్గి రూ.46,465కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో ధర పడిపోయినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com