మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- September 03, 2026
మస్కట్: చేపల వేటకు వెళ్లి పడవ మునిగిపోవడంతో గల్లంతైన ఇద్దరు యువకులను ఒమన్‌లోని దయ్మానియాత్ దీవుల సమీపంలో స్థానిక జాలరి సురక్షితంగా రక్షించాడు. బుధవారం సాయంత్రం వారిద్దరినీ గుర్తించి రక్షించినట్లు అధికారులు తెలిపారు.
పడవ మునిగిపోయిన తర్వాత ఇద్దరు యువకులు కనిపించకుండా పోవడంతో గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ నౌకలు, పోలీసు విమానాలు, స్థానిక మత్స్యకారుల పడవలు సమన్వయంతో పాల్గొన్నాయి.
గంటల పాటు సాగిన విస్తృత గాలింపు చర్యల అనంతరం దయ్మానియాత్ దీవుల ప్రాంతంలో ఇద్దరు యువకులను స్థానిక ఫిషర్ మెన్ గుర్తించాడు. వెంటనే వారిని తన పడవలోకి తీసుకుని సురక్షితంగా రక్షించాడు.
సంబంధిత ప్రభుత్వ విభాగాలు, స్థానిక సముద్ర మత్స్యకారుల సమన్వయంతో నిర్వహించిన సంయుక్త గాలింపు చర్యలు ఫలించాయని అధికారులు తెలిపారు. రక్షించబడిన ఇద్దరు యువకులు ఆరోగ్యంగా, ఎలాంటి గాయాలు లేకుండా ఉన్నట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







