ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం :వీకే సింగ్‌

- August 19, 2016 , by Maagulf
ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం :వీకే సింగ్‌

సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను కేంద్రమంత్రి వీకే సింగ్‌ కలిసారు. రాష్ర్టాల వారీగా బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన వేలాది భారతీయ కార్మికులకు సాయం చేయడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ నెల రోజుల్లోనే మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లారు. వారికి అక్కడే ప్రత్యామ్నా య ఉపాధిని చూపించడం లేదా వెంటనే భారతకు తీసుకు రావడమనే ద్విముఖ వ్యూహంతో ఆయన సౌదీ విమానం ఎక్కారు. అక్కడి సౌదీ ఓగెర్‌, సౌదీ బిన్‌ లాడెన్‌, సాద్‌ గ్రూపు కంపెనీల్లో భారతీయ ఉద్యోగులకు తిరిగి స్వ దేశానికి వచ్చేయడం తప్ప మరో మార్గం లేదు.ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించడానికి వీకే సింగ్‌ అక్కడికి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com