ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!

- September 04, 2026 , by Maagulf
ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!

దోహా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఎలాంటి రూపంలోనూ శిక్షలు విధించరాదని ఖతార్ విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) స్పష్టం చేసింది. విద్యార్థులతో వ్యవహరించే సమయంలో ఉద్యోగులు నైతిక నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. స్కూల్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ విభాగం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. విద్యార్థుల గౌరవం, మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతూ వృత్తిపరమైన, విద్యాపరమైన విలువలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది.

విద్యార్థులకు శారీరక, మాటల ద్వారా లేదా మానసికంగా శిక్షించడం పూర్తిగా నిషేధం అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే ఇతర రకాల వేధింపులు, దుర్వినియోగ చర్యలకు కూడా అనుమతి లేదని తెలిపింది. విద్యార్థుల ప్రవర్తనకు సంబంధించిన ఉల్లంఘనలు లేదా సమస్యలను శిక్షల ద్వారా కాకుండా, ప్రభుత్వం ఆమోదించిన విధానాలు, నిబంధనలు మరియు సర్క్యులర్లకు అనుగుణంగా తగిన విద్యాపరమైన పద్ధతులతో పరిష్కరించాలని సూచించింది.

ఈ ఆదేశాలను ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కచ్చితంగా పాటించాలని స్కూల్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ విభాగం కోరింది. నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులను వేధించే లేదా దుర్వినియోగానికి పాల్పడే వారిపై అమల్లో ఉన్న విధానాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థులకు సురక్షితమైన, సహాయకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది చేస్తున్న కృషిని మంత్రిత్వశాఖ అభినందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com