ఈ నిర్లక్ష్యం కాదు క్షమార్హం
- August 19, 2016
ఆకాశాన్నంటే భవనాలు, అందులో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, దానికి తోడు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి పసి ప్రాణాల్ని చిదిపేస్తున్నాయి. సార్జాలో ఇటీవల అపార్ట్మెంట్లపైనుంచి పడిపోయి మృతి చెందుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండు నెలల్లో ఐదుగురు చిన్నారులు ఇదే విధంగా బాల్కనీల్లోంచి కిందకు పడిపోయి చనిపోయారు. బాల్కనీలు, కిటికీల నుంచి పిల్లలు పడిపోతోంటే, వారిని సంరక్షించాల్సిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం వహిస్తుండడం దురదీష్టకరం. భవనాల మీద నుంచి పిల్లలు కిందపడి చనిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమేనని షార్జా పోలీస్ కమాండర్ - బ్రిగేడియర్ సైఫ్ అల్ షమ్సి చెప్పారు. కిటికీలు, అలాగే బాల్కనీల ఎత్తు కనీసం 120 సెంటీమీటర్లు ఉండేలా చూడాలనీ, కిటికీ ఊచల మధ్య గ్యాప్ 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటే ప్రమాదాలు జరగవనీ, నిర్మాణదారులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయమై భవన నిర్మాణదారులు, అలాగే ల్యాండ్ లార్డ్స్‌తో సమావేశమై భద్రతా చర్యలు పెంచే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







