ఫేక్ బిల్స్: నైజీరియన్ అరెస్ట్
- August 19, 2016
100 డాలర్ల విలువైన ఫేక్ బిల్స్‌ని సర్క్యులేట్ చేస్తున్న నేరానికిగాను నైజీరియాకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 43 ఏళ్ళ నిందితుడు విజిట్ వీసాపై వచ్చాడు. కస్టమ్స్ వద్ద 1 మిలియన్ డాలర్లు సీజ్ చేయబడ్డాయనీ, 2,600 డాలర్లు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చని చెబుతూ ఓ మహిళను మోసం చేశాడు. పోలీసులు విచారణ జరిపి నిందితుడ్ని అరెస్టు చేసి, న్యాయస్థానానికి తరలించారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, నిందితుడికి 5,000 దిర్హామ్‌ల ఫైన్ విధించింది. ఏడాది జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళతో బాధితురాలికి నిందితుడు వల వేశాడు. బాధిత మహిళ, నిందితుడికి 2,600 డాలర్లు చెల్లించినట్లు పేర్కొంది. కొన్ని పత్రాలపై సంతకాల కోసం నిందితుడు తనపై ఒత్తిడి తీసుకురాగా, తాను నిరాకరించినట్లు తెలిపిందామె. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అపీల్ చేసుకోవడానికి నిందితుడికి అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







