అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష

- September 04, 2026 , by Maagulf
అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష

అబుదాబి: అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడు శుక్రవారం క్షమాభిక్ష మంజూరు చేశారు. అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆగస్టు 27, 2026న ఆయనపై నమోదైన కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు AED 2 లక్షల జరిమానా విధించింది.

ఈ నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయనకు క్షమాభిక్ష ప్రకటించారు.

క్షమాభిక్షను అమలు చేసేందుకు అవసరమైన అన్ని అధికారిక, చట్టపరమైన ప్రక్రియలను సంబంధిత అధికారులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com