దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- September 05, 2026
దమ్మామ్: సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్య మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. విదేశాల నుంచి వచ్చిన పోస్టల్ పార్సెల్‌లో దాచిన 18,549 యాంఫెటమైన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రతినిధి హమూద్ అల్-హర్బీ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీలోకి వచ్చిన పార్సెల్‌ను కస్టమ్స్ తనిఖీల సందర్భంగా అత్యాధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా ఈ పిల్స్ బయటపడ్డాయని పేర్కొన్నారు. మాదకద్రవ్య మాత్రలను పార్సెల్‌లో అత్యంత జాగ్రత్తగా దాచినట్లు అధికారులు తెలిపారు.
మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అనంతరం, వాటిని సౌదీ అరేబియాలో స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ZATCA అధికారులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC)తో సమన్వయం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ప్రయత్నానికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
స్మగ్లింగ్‌పై కఠిన నిఘా
దేశంలోని అన్ని ప్రవేశ కేంద్రాల్లో దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని అల్-హర్బీ తెలిపారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోవడం, సమాజాన్ని రక్షించడం కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాదకద్రవ్య నియంత్రణ విభాగంతో సమన్వయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద స్మగ్లింగ్ కార్యకలాపాలపై ప్రజలు భద్రతా హెల్ప్‌లైన్ 1910 లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా సమాచారం అందించాలని ZATCA కోరింది.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







