సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!

- September 08, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!

రియాద్: ఇంధన లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 4,464 జెనెసిస్ వాహనాలను రీకాల్ చేసింది. వాహనాల్లోని ఫ్యూయల్ క్రాస్ ట్యూబ్ మౌంటింగ్‌లో లోపం కారణంగా ఇంధనం లీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం పెరగవచ్చని పేర్కొన్నారు.

ఈ రీకాల్ కింద జెనెసిస్‌కు చెందిన 8 మోడళ్ల వాహనాలు ఉన్నాయి. వీటిలో GV70, GV80, G80, G90 మోడళ్లకు చెందిన 2021 నుంచి 2026 వరకు తయారైన కొన్ని వాహనాలు ఉన్నాయి. రీకాల్‌లో తమ వాహనం ఉందో లేదో తెలుసుకోవడానికి యజమానులు Recalls.sa వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. రీకాల్‌కు సంబంధించిన వాహనాల యజమానులు Almajdouie లేదా Wallan Al-Naghiను సంప్రదించి అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com