కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- September 08, 2026
కువైట్: ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలకు ముప్పు కలిగించిన ముగ్గురిని ట్రాఫిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గుర్తించిన అనంతరం అధికారులు దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన అధికారులు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు.
నిందితులు ఉపయోగించిన వాహనాలపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ వాహనాలను ధ్వంసం చేశారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 ప్రకారం వాహనాలను స్వాధీనం చేసుకుని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్పగించేలా కోర్టు తీర్పు ఇచ్చింది.
నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కువైట్ ట్రాఫిక్ శాఖ హెచ్చరించింది. ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







