ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- September 08, 2026
మస్కట్: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ విభాగం తాజా హెచ్చరికలో తెలిపింది.
అల్ హజర్ పర్వత ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో బలమైన కిందివైపు గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అదేవిధంగా దోఫార్ గవర్నరేట్ తీర ప్రాంతాలు, సమీప పర్వత ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ విభాగం తెలిపింది. ఈ ప్రాంతాల్లో చిరుజల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో అవుతూ ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







