స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- September 08, 2026
కువైట్: వచ్చే వారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వివిధ ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల్లో 200 ట్రాఫిక్ పెట్రోల్స్, 420 మంది ట్రాఫిక్ అధికారులను మోహరించింది. ఈ ఏర్పాట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగిస్తున్న “ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ” ప్రచారంలో భాగమని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ట్రాఫిక్ అవేర్‌నెస్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హస్సన్ తెలిపారు.
ట్రాఫిక్ పెట్రోల్స్, అధికారులు ప్రధాన రహదారులు మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, పీక్ అవర్స్‌లో వాహనాల సాఫీ రాకపోకలను నిర్ధారించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ఆధునిక, సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు బు హస్సన్ తెలిపారు. మొత్తం 258 సర్కిల్స్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించబడ్డాయి. ట్రాఫిక్ సాంద్రతను బట్టి సిగ్నల్స్‌ను ప్రోగ్రామ్ చేయడం ద్వారా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి రద్దీని తగ్గించవచ్చని వివరించారు. అలాగే రోడ్లు, సర్కిళ్లను పర్యవేక్షించేందుకు 338 కెమెరాలతో కూడిన మానిటరింగ్, ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. దీని ద్వారా ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం గమనించి, రద్దీ ఏర్పడినప్పుడు అధికారులు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని చెప్పారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అప్రమత్తంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







