పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- September 08, 2026
హూరా: విధి నిర్వహణలో ఉన్న పోలీసు సార్జెంట్‌పై దాడి చేసిన కేసులో ఒక నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన 2026 ఫిబ్రవరి 17న హూరా ప్రాంతంలో చోటుచేసుకుంది. అధికారులు నిందితుడు అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో నిందితుడు పోలీసులపై అరుస్తూ, వారిని మాటలతో దూషించినట్లు సమాచారం.
అనంతరం అతడికి హ్యాండ్ కఫ్స్ వేసి పోలీసు పెట్రోల్ వాహనంలో కూర్చోబెట్టగా, నిందితుడు వాహనం కిటికీని తన్నాడు. అతడిని అదుపు చేసేందుకు పోలీసు సార్జెంట్ ప్రయత్నించగా, నిందితుడు సార్జెంట్ ముఖం, భుజం, ఛాతీపై మూడుసార్లు తన్నినట్లు కేసు వివరాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసు అధికారిని దూషించి, అతడిపై ఉమ్మివేసినట్లు తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు పోలీసు అధికారిపై దాడి చేసినట్లు అంగీకరించాడు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం, నిందితుడిని అదుపు చేసే సమయంలో సార్జెంట్ చిటికెన వేలికి గాయమైంది. ఈ కేసులో నిందితుడికి ఏప్రిల్ 28న గైర్హాజరీలో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అనంతరం మే 7న అతడి న్యాయవాది తీర్పుపై అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి తీర్పు కోసం సెప్టెంబర్ 29కు వాయిదా పడింది.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







