గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
- September 08, 2026
హైదరాబాద్: మండపాల నిర్వాహకులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా http://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీపీ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు.మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల సమాచారం, మరియు నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల వివరాలను ముందస్తుగా సమర్పించాల్సి ఉంటుంది.ముందస్తు సమాచారం అందుబాటులో ఉంటే సదరు ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, భద్రతతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణను సమర్థంగా చేపట్టవచ్చని వెల్లడించారు.
డీజీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణ & భద్రతా చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్ ఎస్ఐ మరియు అంతకంటే పైస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నెల 14న గణేశ్ చతుర్థి, 25న నిమజ్జన ఊరేగింపులు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు.స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు (SHO) ప్రత్యేక లాగిన్ వివరాలు అందించి, తమ పరిధిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సదుపాయం కల్పించారు. ప్రతి మండపం వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చేలా, వాలంటీర్లను నియమించేలా ఉత్సవ కమిటీలను ప్రోత్సహించాలని డీజీపీ ఆదేశించారు. నిబంధనలు పాటించే మండపాలను జియో-ట్యాగ్ చేసి ‘TG-COP’ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.సమన్వయ సమావేశాలు: ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలు స్థానిక ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లపై నిశిత నిఘా ఉంచాలని సూచించారు.
తాజా వార్తలు
- గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!







