ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.
- July 29, 2015
యు.ఏ.ఈ. ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్ కమిటీ, ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోయే ఇంధన రేట్లను ప్రకటించడం ద్వారా సున్నా-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టింది. అన్ లెడ్ గెసోలిన్ 98 ఆక్టెన్ ధర 22.95 శాతం పెరిగి 2.25 దీనర్, అన్ లెడ్ గెసోలిన్ 95 ఆక్టెన్ ధర 24.41 శాతం పెరిగి 2.14 దీనర్ అయింది. ఇక ఏ-ప్లస్ 91 గెసోలిన్ పెరుగుదల 28.57 శాతం, ధర 2.07 దీనర్ అవ్వగా, డీసిల్ ధర మాత్రం 12.76 శాతం తగ్గి 2.05 డినార్ అయింది. ఈ శాందర్భంగా అల్ న్యాదీ మాట్లాడుతూ, గెసోలిన్ ధర పెరుగుదల ప్రభావం సగటున 18 నుండి 25 దీనర్లవరకు మాత్రమే పడిందని, ఆది వినియోగదారులపై పెద్దభారం కాబోదని అన్నారు. పైగా, ఇది సక్రమ ఇంధన వాడకానికి, ప్రజలు ఎక్కువ ఇంధన సమర్ధత గల కార్లను ఎంచుకోవడానికీ దోహాదమౌతుందనీ; ఇంకా డీజిల్ ధర తగ్గడం వలన దేశమంతా ప్రజలు ప్రజలు, పరిశ్రమలు, నౌకారంగం వంటివి లాభపడ్డాయని విశ్లేషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







