డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- November 02, 2026
రియాద్: అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పరిస్థితులను సమీక్షించిన OPEC+ కూటమి, డిసెంబర్ 2026లోనూ చమురు ఉత్పత్తి కోటాను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా మూడో నెల కూడా ఉత్పత్తి స్థాయిల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని అంగీకరించింది. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, అల్జీరియా, కజకిస్థాన్, ఒమన్ దేశాలకు చెందిన ఏడుగురు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు OPEC ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలపై సమావేశంలో చర్చించారు.
చమురు ఉత్పత్తికి సంబంధించి గతంలో ప్రకటించిన ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తమ దేశాలు కట్టుబడి ఉన్నాయని సభ్య దేశాలు పునరుద్ఘాటించాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ఎగుమతుల్లో అంతరాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది వరకు ఉత్పత్తి విధానంలో మరిన్ని మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్ 2026లో నిర్ణయించిన ఉత్పత్తి స్థాయిలనే డిసెంబర్‌లోనూ కొనసాగించాలని ఏడు దేశాలు నిర్ణయించినట్లు OPEC తెలిపింది.
అంతకుముందు ఆగస్టులో సెప్టెంబర్ నెల నుంచి రోజుకు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఈ దేశాలు అంగీకరించాయి. అయితే సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో అక్టోబర్ నెలకు కూడా అదే ఉత్పత్తి స్థాయిలను కొనసాగించాలని నిర్ణయించాయి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఏడు దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగించనున్నాయి. తదుపరి సమావేశం నవంబర్ 29న జరగనుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- దుబాయ్ పర్యాటకులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో PACT ఆధ్వర్యంలో సందడిగా దాండియా నైట్..!!
- కువైట్‌లో 20 శాతం తగ్గిన కోర్టు కేసులు..!!
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!







