ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- September 17, 2026
దోహా: ఖతార్‌లో కొన్ని దిగుమతి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమిరీ డిక్రీ నంబర్ 45 ఆఫ్ 2026 ప్రకారం ఈ మార్పులు చేయగా, సెప్టెంబర్ 16, 2026న ప్రచురించిన అధికారిక గెజిట్ 17వ సంచికలో వివరాలను వెల్లడించారు.
చికెన్‌పై 18% సుంకం
కొత్త డిక్రీ ప్రకారం కట్ చేయని తాజా లేదా ఫ్రీజింగ్ చికెన్‌పై కస్టమ్స్ డ్యూటీ 18 శాతానికి పెంచారు. అలాగే కొన్ని కూరగాయలపై 15% సుంకం పెంచారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా జుక్కిని, వంకాయలు, టమాటాలపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి పెంచారు. అయితే ఈ పెరిగిన డ్యూటీ ఆయా కూరగాయల స్థానిక వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉండే నిర్దిష్ట కాలాల్లో మాత్రమే వర్తిస్తుంది.
సీజన్ వారీగా పెంచిన డ్యూటీ వర్తించే కాలాలు:
- టమాటాలు: జనవరి నుంచి మే వరకు
- వంకాయలు: జనవరి నుంచి ఏప్రిల్ వరకు, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు
- జుక్కిని: జనవరి నుంచి ఏప్రిల్ వరకు, అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
60 రోజుల తర్వాత అమలు
ఈ కొత్త కస్టమ్స్ సుంకాలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. కొత్త నిర్ణయం ప్రకారం చికెన్‌తో పాటు కొన్ని కూరగాయల దిగుమతులపై నిర్దిష్ట కాలాల్లో అధిక సుంకాలు విధించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







