ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!

- September 18, 2026 , by Maagulf
ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!

దోహా: నమ్మకమైన ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ కంపెనీల పేర్లను ఉపయోగించి మోసపూరిత టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిళ్ల ద్వారా జరుగుతున్న ఫిషింగ్, ఇంపర్సనేషన్ మోసాలపై ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) ప్రజలను అప్రమత్తం చేసింది.

సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ ప్రజలకు ఫేక్ మెసేజ్‌లు, ఈమెయిళ్లు పంపుతున్నారని NCSA తెలిపింది. ఈ తరహా మోసాలకు గురికాకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

 ఏదైనా మెసేజ్ లేదా ఈమెయిల్‌కు స్పందించే ముందు పంపిన వ్యక్తి లేదా సంస్థ నిజమైనదేనా అని నిర్ధారించుకోవాలి. తెలియని లేదా ఊహించని టెక్స్ట్ మెసేజ్‌లు, ఈమెయిళ్లలో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయకూడదు. గుర్తుతెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన ఫైల్స్, అటాచ్‌మెంట్లను ఓపెన్ చేయకూడదు. మెసేజు నిజమైనదిగా కనిపించినప్పటికీ, దాని మూలాన్ని ధృవీకరించిన తర్వాతే స్పందించాలని NCSA సూచించింది.

సైబర్ నేరగాళ్లు నమ్మకమైన సంస్థల పేర్లు, లోగోలు, అధికారికంగా కనిపించే మెసేజులను ఉపయోగించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com