ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!

- September 18, 2026 , by Maagulf
ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!

ఇబ్రీ: ఒమన్‌లోని ఇబ్రీ విలాయత్‌లో సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్డుపై కొండచరియలు జారిపడిన ఘటన చోటుచేసుకుంది. లులు హైపర్‌మార్కెట్ తర్వాతి ప్రాంతంలో కొండపై నుంచి రాళ్లు రోడ్డుపై పడినట్లు అధికారులు తెలిపారు.

ఈ రాళ్లు మస్కట్ వైపు వెళ్లే మార్గంలో పడటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతం మీదుగా ప్రయాణించే వారు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని అధికారులు సూచించారు.

రోడ్డుపై రాళ్లు పడిన ప్రాంతంలో వేగాన్ని తగ్గించి, పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com