కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- September 19, 2026
కువైట్: ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు వినియోగదారుల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఇద్దరిని కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది. ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను అధికారులు పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వాహనాలు నడుపుతూ ప్రమాదకర స్టంట్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ చర్యలతో వారి ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులు, రోడ్డు పక్కన ఉన్న ఆస్తులకు కూడా ముప్పు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ఘటనలపై దర్యాప్తు చేపట్టిన అనంతరం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తన అధికారిక X ఖాతాలో వెల్లడించింది. అరెస్ట్ చేసిన ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలిగించే విధంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసే వారిని నిరంతరం పర్యవేక్షించడం, గుర్తించడం, చట్టపరంగా బాధ్యులను చేయడం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్‌లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్‌లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్‌కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







