30 శాతం అగ్ని ప్రమాదాలకు 4 నిమిషాల్లోనే స్పందన
- August 21, 2016
30 శాతం అగ్ని ప్రమాదాల విషయంలో దుబాయ్ సివిల్ డిఫెన్స్ కేవలం 4 నిమిషాల్లోనే స్పందించి, అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ రషీద్ తని అల్ మత్రౌషి మాట్లాడుతూ, 90 శాతం అగ్ని ప్రమాదాల విషయంలో 6 నుంచి 8 నిమిషాల్లోనే స్పందించాలని టార్గెట్‌గా పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు. అల్ హామ్రియా ఫైర్ స్టేషన్‌ని సందర్శించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. పబ్లిక్ కూడా సివిల్ డిఫెన్స్‌కి సహకరించాలనీ, అగ్ని ప్రమాదాల్లో పబ్లిక్ పాత్ర ఎంతో కీలకమని ఆయన వివరించారు. ప్రమాదం గురించి సమగ్ర సమాచారం అందించగలిగితే, పరిస్థితిపై ఓ అవగాహన ఏర్పాటుచేసుకుని, తగిన రీతిలో స్పందించడానికి వీలవుతుందని అల్ హామ్రియా చెప్పారు. అత్యవసర సమయాల్లో వాహనదారులు, ఫైర్ ట్రక్స్‌కి దారి విడిచిపెట్టడం ద్వారా ప్రమాద స్థలికి తొందరగా చేరుకోగలుగుతామన్నారు అల్ హమ్రియా. అంతర్జాతీయ ప్రమాణాలతో దుబాయ్ సివిల్ డిఫెన్స్ పనిచేస్తోందనీ, ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ అల్ హామ్రియా వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







