ఇండస్ట్రియల్ భద్రత కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్, ఆపరేషన్స్ సెంటర్..!!
- September 21, 2026
రియాద్: ఇండస్ట్రియల్ భద్రత కోసం అథారిటీ ప్రధాన కార్యాలయంలో యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఆపరేషన్స్ సెంటర్‌ను సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రి, సుప్రీం అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ బోర్డు చైర్మన్ ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సౌద్ బిన్ నాయెఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆపరేషన్స్ సెంటర్లోని కార్యకలాపాలను పరిశీలించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 123 ఆటోమేటెడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అలాగే సౌదీ అరేబియాలోని 30కి పైగా సంస్థలు, పారిశ్రామిక సదుపాయాలతో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. డిజిటల్ సేవలు, కార్యకలాపాల విధానాలను ఏకీకృతం చేయడం, సేవల సామర్థ్యం, నాణ్యతను పెంచడం, డిజిటల్ పరివర్తనకు ఊతమివ్వడం, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన లక్ష్యాలని అధికారులు తెలిపారు. కీలక పారిశ్రామిక సదుపాయాల రక్షణతో పాటు సౌదీ విజన్ 2030 లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభించిన ఆపరేషన్స్ సెంటర్లో క్రైసిస్ మేనేజ్మెంట్ రూమ్, కమ్యూనికేషన్స్ సెంటర్, నేషనల్ ఇండస్ట్రియల్ క్రిటికల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ ఉన్నాయి. సౌదీ అరేబియా వ్యాప్తంగా పనిచేస్తున్న 73కి పైగా ఆపరేషన్స్ సెంటర్లను ఈ కేంద్రం సమగ్రంగా పర్యవేక్షించనుంది. ఆయా కేంద్రాల నుంచి సమాచారం, నివేదికలను రియల్‌టైమ్‌లో మార్పిడి చేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా పారిశ్రామిక భద్రతకు సంబంధించిన ఏకీకృత కార్యాచరణ చిత్రాన్ని అందించనుంది.
ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, వేగంగా స్పందించేందుకు వీలు కల్పించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించడం, సన్నద్ధతను పెంచడం, వ్యాపార కార్యకలాపాల నిరంతర కొనసాగింపును నిర్ధారించడం ఈ కేంద్రం ద్వారా సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్
- భారతీయుడికి వైద్య అత్యవసర పరిస్థితి.. హెలికాప్టర్లో తరలించిన ఒమన్ వైమానిక దళం
- ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు
- పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 16 నుంచే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!







