రెండు వారాల్లో సాధారణ స్థాయికి ఖతార్ ఎల్ఎన్జీ సామర్థ్యం..!!
- September 21, 2026
న్యూయార్క్: హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే ఖతార్ తమ ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యాన్ని రెండు వారాల్లో సాధారణ స్థాయికి తీసుకురాగలదని ఖతార్ ఇంధన శాఖ సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ సీఈఓ, ప్రెసిడెంట్ సాద్ షెరీదా అల్-కాబీ తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఖతార్ ఎకనామిక్ ఫోరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న తర్వాత ఖతార్ ఎల్ఎన్జీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. దెబ్బతిన్న 17 శాతం సామర్థ్యాన్ని మినహాయిస్తే, మిగిలిన కార్యకలాపాలను రెండు వారాల్లో సాధారణ స్థాయికి తీసుకురాగలమని చెప్పారు.
మార్చిలో ఖతార్ ఎనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 18, 19 తేదీల్లో జరిగిన క్షిపణి దాడుల్లో రాస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం కారణంగా సంవత్సరానికి సుమారు 20 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం సంభవించవచ్చని, మరమ్మతులకు ఐదేళ్ల వరకు సమయం పట్టవచ్చని సంస్థ అంచనా వేసింది. ఈ దాడుల్లో ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే*ట్రెయిన్ 4, ట్రెయిన్ 6 దెబ్బతిన్నాయి. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 12.8 మిలియన్ టన్నులు (MTPA). ఇది ఖతార్ మొత్తం ఎల్ఎన్జీ ఎగుమతుల్లో దాదాపు 17 శాతానికి సమానం.
ట్రెయిన్ 4లో ఖతార్ ఎనర్జీకి 66 శాతం, ఎక్సాన్మొబిల్కు 34 శాతం వాటా ఉంది. ట్రెయిన్ 6లో ఖతార్ ఎనర్జీ వాటా 70 శాతం, ఎక్సాన్‌మొబిల్ వాటా 30 శాతంగా ఉంది. అయితే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం ద్వారా రవాణా, ఎగుమతులకు సంబంధించిన ఆంక్షలు తొలగితే, దెబ్బతిన్న 17 శాతం సామర్థ్యాన్ని మినహాయించి మిగిలిన ఎల్ఎన్జీ కార్యకలాపాలను తక్కువ వ్యవధిలోనే పునరుద్ధరించగలమని ఖతార్ ఇంధన మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్
- భారతీయుడికి వైద్య అత్యవసర పరిస్థితి.. హెలికాప్టర్లో తరలించిన ఒమన్ వైమానిక దళం
- ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు
- పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 16 నుంచే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!







