గాల్లో రివ్వున దూసుకెళ్లే ట్యాక్సీలు..
- August 22, 2016
ఇప్పటికే గూగుల్.. ఉబర్.. ఐబీఎం.. టెస్లా వంటి దిగ్గజ సంస్థలు స్వయం నియంత్రిత వాహనాల తయారీలో తలమునకలై ఉన్నాయి. డ్రైవర్‌లెస్ కార్లను.. బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి పరీక్షిస్తున్నాయి. అలాగే త్వరలో గాల్లో రివ్వున దూసుకెళ్లే స్వయం నియంత్రిత ట్యాక్సీలు కూడా రాబోతున్నాయి. అందుకోసం ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ కసరత్తులు ముమ్మరం చేసింది. నగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే 'అటానమస్ ఫ్లైయింగ్ ట్యాక్సీ'లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌బస్ ప్రకటించింది. .డ్రోన్ల మాదిరిగా ఉండే ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలకు 'సిటీ ఎయిర్‌బస్' అని పేరు పెట్టారు.ఇవి ప్రయాణికులతోపాటు.. సరుకు రవాణాకు కూడా ఉపయోగపడతాయట. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఇచ్చే కమాండ్‌తో ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎక్కడికంటే అక్కడికి ఎగిరి వెళ్లిపోతుందట. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వీటి తయారీని ప్రారంభించిన ఎయిర్‌బస్.. తొలి డిజైన్‌ను 2017లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు తెలిపింది.గాల్లో ఎగిరేటప్పుడు దానంతట అదే ఎయిర్ ట్రాఫిక్‌ను గుర్తించే వ్యవస్థను సవాల్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ చెబుతోంది. మరో పదేళ్లలో పూర్తి స్థాయి ఫ్లైయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.వీటితోనైనా నగరాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి కాసింత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందేమో.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







