వరుణ్‌సందేశ్ "మిస్టర్ 420' ...
- August 22, 2016
కథ, కథనాలు విభిన్నంగా "మిస్టర్ 420' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత గజ్జల హరికుమార్‌రెడ్డి తెలిపారు. వరుణ్‌సందేశ్, ప్రియాంక భరద్వాజ్ నాయకానాయికలుగా ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సాన్వి క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, "వరుణ్‌సందేశ్‌కు ఇది సూపర్‌హిట్ చిత్రంగా నిలవబోతోందని గర్వంగా చెబుతున్నాను.ఇందులో ఆయన కొత్త లుక్‌తో స్టైలిష్‌గా కనిపించబోతున్నారు. దర్శకుడు అనుకున్నట్లుగా సినిమాను పూర్తిచేస్తున్నారు. థర్టీ ఇయర్స్ ఫృథ్వి ఈ మధ్య వరుసగా తనదైన హాస్య పాత్రలతో ఆకట్టుకుంటున్న విషయం తెలియంది కాదు. ఈ చిత్రంలో కూడా తన పాత్ర ద్వారా మంచి వినోదాన్ని పంచనున్నారు. మోహన్‌చంద్ర సంభాషణలు చాలా బావుంటాయి. రియాన్ ముస్తఫా సంగీతం, జస్వంత్ ఛాయాగ్రహణం, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్‌ల సాహిత్యం, నందు ఫైట్స్ సినిమాకు హైలైట్‌గా ఉండటంతో పాటు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ నెల 27న చిత్ర ప్రముఖుల సమక్షంలో ఆడియోను, సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో షాయాజీషిండే, రఘుబాబు, సాయి, షాని, శేఖర్, జీవా, రఘు కారుమంచి, రచ్చ రవి, మీనా తదితరులు తారాగణం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







