రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- September 22, 2026
ఇబ్రా: ఒమన్‌లోని నార్త్ అల్ షర్కియాహ్ గవర్నరేట్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశమైంది. స్థానిక అభివృద్ధి, ప్రజా సేవలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా రిమాల్ అల్ షర్కియాహ్ (అల్ షర్కియాహ్ సాండ్స్) పర్యాటక ప్రాంత అభివృద్ధి, గవర్నరేట్‌లోని పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించడం, పెట్టుబడి ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నార్త్ అల్ షర్కియాహ్ గవర్నర్, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహ్మూద్ బిన్ యహ్యా అల్ ధుహ్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సినావ్ విలాయత్‌లో ఆహార భద్రత, పశుసంపదకు సంబంధించిన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన పెట్టుబడి ప్రణాళికపై కూడా కౌన్సిల్ చర్చించింది. అలాగే ఇబ్రా–అల్ ముదైబీ విలాయత్లను కలిపే రహదారికి సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా సేవా కేంద్రాలకు ప్రజలు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు.
గవర్నరేట్‌లో హరితీకరణను ప్రోత్సహించడం, పట్టణ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలను కూడా కౌన్సిల్ పరిశీలించింది. నార్త్ అల్ షర్కియాహ్ గవర్నరేట్‌లో ప్రజా సేవల ప్రమాణాలను మెరుగుపరచడం, స్థిరమైన ఆర్థిక మరియు పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకోవడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమన్వయం, సమగ్ర సహకారం అవసరమని మున్సిపల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







