సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ధైర్యo

- August 22, 2016 , by Maagulf
సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ధైర్యo

అర్ధరాత్రి పూట ఏదైనా ప్రమాదం జరిగితే సాధారనంగా అటువైపు వెళ్లేవాళ్లు మనకు ఎందుకొచ్చిందిలే అని ఊరుకుంటారు. కనీసం గాయపడిన వాళ్లను చూసే ప్రయత్నం కూడా చేయరు. కానీ రస్ అల్ ఖైమా ప్రాంతంలో మాత్రం ఆస్ట్రియాకు చెందిన ఓ మహిళ అద్భుతమైన సాహసం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడిన అరబ్ యువతిని తక్షణం కారులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స చేసి.. తర్వాత వైద్య బృందానికి తెలిపింది. దాంతో ఆ అరబ్ యువతి ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఫస్ట్ క్లాస్ హోటల్‌లో పనిచేసే సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలకు గాను ఆమెను సత్కరించి, పురస్కారం అందజేసినట్లు ఆ ప్రాంత పోలీసు అధికారి అబ్దుల్లా ఖమీస్ అల్ హదీదీ తెలిపారు.బాధితురాలు కారు నడుపుతూ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిందని.. కారు పలుమార్లు బోల్తా పడి హమారా మాల్ ఎదురుగా పడిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న సబ్రినా వెంటనే ఆమె వద్దకు పరుగున వెళ్లి కారులోంచి బయటకు లాగి, ఆమెకు అత్యవసరంగా చేయాల్సిన చికిత్స చశారు. అనంతరం సెంట్రల్ ఆపరేషన్స్ రూంకు ఫోన్ చేశారు. ఆమె అంత తక్షణం స్పందించడం వల్లే అరబ్ యువతి ప్రాణాలు దక్కినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో అందరూ ఆమె మార్గంలో నడిచి, పరస్పర సామాజిక బాధ్యతను చూపించాలని అల్ హదీదీ అన్నారు. సబ్రినా వెంటనే స్పందించకపోతే బాధితురాలు మరణించి ఉండేదని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com