'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' ...

- August 22, 2016 , by Maagulf
'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' ...

చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. కాజల్‌ కథానాయిక. కొణెదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాత రాంచరణ్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర బృందం, తోటతరణి, రత్నవేల్‌, దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత రాంచరణ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌లను ఇందులో పరిచయం చేశారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌ అంటూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com