సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ధైర్యo
- August 22, 2016
అర్ధరాత్రి పూట ఏదైనా ప్రమాదం జరిగితే సాధారనంగా అటువైపు వెళ్లేవాళ్లు మనకు ఎందుకొచ్చిందిలే అని ఊరుకుంటారు. కనీసం గాయపడిన వాళ్లను చూసే ప్రయత్నం కూడా చేయరు. కానీ రస్ అల్ ఖైమా ప్రాంతంలో మాత్రం ఆస్ట్రియాకు చెందిన ఓ మహిళ అద్భుతమైన సాహసం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడిన అరబ్ యువతిని తక్షణం కారులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స చేసి.. తర్వాత వైద్య బృందానికి తెలిపింది. దాంతో ఆ అరబ్ యువతి ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఫస్ట్ క్లాస్ హోటల్లో పనిచేసే సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలకు గాను ఆమెను సత్కరించి, పురస్కారం అందజేసినట్లు ఆ ప్రాంత పోలీసు అధికారి అబ్దుల్లా ఖమీస్ అల్ హదీదీ తెలిపారు.బాధితురాలు కారు నడుపుతూ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిందని.. కారు పలుమార్లు బోల్తా పడి హమారా మాల్ ఎదురుగా పడిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న సబ్రినా వెంటనే ఆమె వద్దకు పరుగున వెళ్లి కారులోంచి బయటకు లాగి, ఆమెకు అత్యవసరంగా చేయాల్సిన చికిత్స చశారు. అనంతరం సెంట్రల్ ఆపరేషన్స్ రూంకు ఫోన్ చేశారు. ఆమె అంత తక్షణం స్పందించడం వల్లే అరబ్ యువతి ప్రాణాలు దక్కినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో అందరూ ఆమె మార్గంలో నడిచి, పరస్పర సామాజిక బాధ్యతను చూపించాలని అల్ హదీదీ అన్నారు. సబ్రినా వెంటనే స్పందించకపోతే బాధితురాలు మరణించి ఉండేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







