సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- September 24, 2026
రియాద్: సౌదీ అరేబియాలో కొత్తగా ఆరు డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, గవర్నరేట్లలో ఈ డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న డ్రైవింగ్ స్కూల్స్ అసీర్, జజాన్, దమ్మామ్ మెట్రోపాలిటన్ ప్రాంతం, హాయిల్, మక్కా, అల్-జౌఫ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలనుకునే ఆసక్తిగల కంపెనీలు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని ట్రాఫిక్ డైరెక్టరేట్ సూచించింది.ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనలు, షరతులు పొందేందుకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌లోని ట్రాఫిక్ లైసెన్సెస్ విభాగాన్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది. ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఒక నెలలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్







