దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- September 24, 2026
దోహా: ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో 22వ దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ (DJWE) నిర్వహించేందుకు ఖతార్ టూరిజం సన్నాహాలు చేస్తోంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. 49కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని, ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా బ్రాండ్లను ప్రదర్శించనున్నట్లు ఖతార్ టూరిజం వెల్లడించింది. ఖతార్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నగలు, విలాసవంతమైన వాచీల కలెక్షన్లను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు.
ఖతార్ టూరిజం చైర్మన్ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ మాట్లాడుతూ.. DJWE ఖతార్ టూరిజం నిర్వహించే ప్రముఖ కార్యక్రమాల్లో ఒకటని తెలిపారు. ప్రపంచ స్థాయి అనుభవాలను అందించడంతో పాటు విలాసవంతమైన పర్యాటక గమ్యస్థానంగా ఖతార్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రదర్శన కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ బ్రాండ్లతో పాటు ఖతార్‌కు చెందిన డిజైనర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అద్భుతమైన కళానైపుణ్యం, సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు.
భారతీయ డిజైనర్లకు ప్రత్యేక పావిలియన్లు
ఈ ఏడాది ప్రదర్శనలో మూడు ప్రత్యేక పావిలియన్లు ఏర్పాటు చేయనున్నారు. ఖతారీ డిజైనర్ల పావిలియన్‌తో పాటు టర్కిష్, భారతీయ పావిలియన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆయా దేశాల నగల సంప్రదాయాలు, డిజైన్లు, కళానైపుణ్యాన్ని సందర్శకులకు పరిచయం చేయనున్నారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లో అంతర్జాతీయ ప్రముఖ సంస్థ క్రిస్టీస్ పాల్గొనడం మరో ప్రత్యేకతగా నిలవనుంది.
తాజా వార్తలు
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!
- దోహాలో 22వ జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్‌కు సన్నాహాలు..!!
- సౌదీలో మరో 6 డ్రైవింగ్ స్కూల్స్..!!
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్







