యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!

- November 10, 2026 , by Maagulf
యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!

యూఏఈ: ఒక్కో నివాసితుడు తన పేరుపై ఎన్ని వాహనాలను రిజిస్టర్ చేసుకోవచ్చనే అంశంపై కొత్త ట్రాఫిక్ చట్టంలో ప్రతిపాదించిన పరిమితి అమలును వాయిదా వేస్తున్నట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనపై సమగ్ర సమీక్ష పూర్తయ్యే వరకు వాయిదా కొనసాగనుంది. 

కొత్త ఫెడరల్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. 2027 జనవరి నుంచి ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ వాహనాలను రిజిస్టర్ చేయడం లేదా రెన్యువల్ చేయించుకోవాలంటే అదనపు వాహనానికి ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కో నివాసితుడి పేరుపై గరిష్ఠంగా ఐదు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా నిబంధన రూపొందించారు.

అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అమలును వాయిదా వేసింది. వాహన యజమానుల హక్కులు, కుటుంబాల అవసరాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలతో పాటు క్లాసిక్, అరుదైన, లగ్జరీ కార్ల వినియోగం వంటి అంశాలను సమీక్షలో పరిశీలించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ చట్టం అమలు నిబంధనల్లోని ఆర్టికల్ 89 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

2027 జనవరి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

ఇదిలా ఉండగా, 2027 జనవరి 1 నుంచి యూఏఈలో పలు కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 
* డ్రైవింగ్ సమయం: 24 గంటల వ్యవధిలో డ్రైవర్లు గరిష్ఠంగా 9 గంటలు మాత్రమే వాహనం నడపాలి. అయితే అంతకంటే తక్కువ సమయం డ్రైవింగ్ చేసినా తీవ్రమైన అలసట ఉంటే వాహనం నడపకూడదు.
* డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్: లైసెన్స్ గడువు ముగిసి 10 ఏళ్లు దాటిన వారు తిరిగి రెన్యువల్ చేసుకోవాలంటే థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
* ఈ-స్కూటర్ అనుమతి: ఎలక్ట్రిక్ స్కూటర్ పర్మిట్ పొందేందుకు కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పర్మిట్ మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది.

కొత్త నిబంధనల ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్ల అలసట కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com