థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- September 27, 2026
దోహా: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో అక్కడ ఉన్న ఖతార్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని థాయ్‌లాండ్‌లోని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది. థాయ్‌లాండ్ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ ఎంబసీ ఈ సూచనలు చేసింది. భారీ వర్షాల కారణంగా నీటిమట్టాలు పెరగడంతోపాటు వరదలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా నదుల సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఖతార్ పౌరులకు ఎంబసీ సూచించింది. *అత్యవసర పరిస్థితుల్లో +66 622162222, +66 809305384, +66 615102679 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్







