ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

- September 27, 2026 , by Maagulf
ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

మస్కట్: డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆరుగురు ఆసియా దేశస్థులను ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ అల్ బతీనా పోలీస్ కమాండ్ పరిధిలోని డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ డైరెక్టరేట్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
అక్రమంగా ఒమన్‌లోకి ప్రవేశించిన ఆరుగురి వద్ద తనిఖీలు నిర్వహించగా 40 కిలోలకు పైగా క్రిస్టల్ మెథాంఫెటమైన్, సైకోట్రోపిక్ మాత్రలు లభించినట్లు అధికారులు తెలిపారు. వీటిని అక్రమంగా రవాణా చేసేందుకు ఉద్దేశించినట్లు వెల్లడించారు.
అదే సమయంలో వారి వద్ద ఒక తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com