సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- September 27, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ (NCM) హెచ్చరించింది. జజాన్, అసీర్, అల్-బహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో పాటు వడగళ్ల వాన, బలమైన గాలులు, దుమ్ము, ఇసుక తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్
ఇదిలా ఉండగా తూర్పు ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అల్-అహ్సా, అల్-ఖోబర్, దమ్మామ్, ఖతీఫ్, బుఖైక్, రాస్ తనూరా ప్రాంతాల్లో ఈ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది. మదీనా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైల్, అల్-ఖాసిమ్, నార్తర్న్ బోర్డర్స్ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో దుమ్ము, ఇసుక ఎగిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







